Sunday, 26 July 2026 10:28:18 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు

Date : 14 May 2026 04:42 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం : డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబొరేటరీ తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖలో నమోదు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నమోదు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే సంబంధిత వైద్య చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన పాజిటివ్ కేసులను వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు సూచించారు. వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :