Monday, 27 July 2026 01:17:08 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏపీఐఐసీ భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

భూ నిర్వాసిత రైతులతో సబ్ కలెక్టర్ సమావేశం

Date : 22 January 2026 08:42 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 ః మండలంలోని రెడ్డి కోట, కుక్క రాజు పల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఇప్పటికే 20 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరణ తో పాటు మరో 40ఎకరాలు రైతుల డికెటి భూములను ఎంపిక చేయడం జరిగిందని ఆ డీకేటి భూముల రైతులు అందరికీ న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హామీ ఇచ్చారు. ఈ భూముల విషయమై గత రెండు నెలల క్రితం భూముల లబ్ధిదారులు రెడ్డి కోట వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ భూముల విషయమై గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఏపీఐఐసీ భూముల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ మన ప్రాంతంలో ఏపీఐఐసీ లో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించి అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరి తద్వారా భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రైతులు సమన్వయం పాటించి భూములు ఇవ్వడానికి సహకరించాలని కోరారు. మీ భూములకు ప్రభుత్వ పరంగా పరిహారం ఎంత ఇవ్వాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కొందరు దళిత రైతులు మాకు మా పెద్దల నుండి సంక్రమించిన ఈ భూమి జీవనాధారమని ఈ భూములు పోతే ఎలా బతకాలని ఫిర్యాదు చేసి ససేమిరా అన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం రైతులు త్యాగం చేయాలని వారికి సబ్ కలెక్టర్ సర్దిచెప్పినా వినకపోవడంతో మరోమారు రైతులు ఆలోచించుకొని సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సిద్ధపడిందని మీరు పెద్ద మనుసుతో ముందుకు రావాలని వచ్చే బుధవారం మరో మారు చివరి అవకాశం రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాశీల్దారు శ్రీనివాసులు, ఆర్ ఐ ముద్దుకృష్ణ, వీఆర్వోలు సంజీవ్, నాగరాజు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :