నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 23 విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ నందు ఉద్యోగాలు పొందారు. కురబలకోట మండలం అంగళ్లకు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు గత నెల 08-10-2025 బుధవారం రోజున విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఫైనల్ ఇయర్ బీటెక్, ఎంసీఏ మరియు ఎంబీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులకు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ నరేంద్ర జి రెడ్డి గారు పాల్గొని సుమారుగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, ఒక నెల తర్వాత అనగా ఈరోజు 07-11-2025 శుక్రవారం రోజున ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. వీరందరికీ మూడు నుంచి ఎనిమిది లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ అధ్యాపకులు మరియు కాలేజీ యాజమాన్యం అభినందించారు. ఇలాంటి కంపెనీలు ఇంకా ఎక్కువ రాబోతున్నాయని విద్యార్థులందరూ బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలని ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి గారు తెలిపారు
Reporter
Namitha News