Monday, 27 July 2026 12:08:42 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ లోని సియం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ

ఇది తమ కుటుంబానికి చిరస్మరణీయ సాయంత్రం అంటున్న చంద్రబాబు

Date : 10 May 2026 11:04 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ - మే 10 : హైదరాబాద్‌ లోని చంద్రబాబు నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీ. చంద్రబాబు కుటుంబం తో ఒక గంట కు పైగా గడిపిన మోదీ. చంద్రబాబు నివాసంలోని సీతారాములకు మోదీ పూజలు ప్రధాని నరేంద్ర మోదీ తమ నివాసానికి రావడం తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన సాయంత్రమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయత, కుటుంబ సభ్యులతో ఆయన కలివిడిగా మాట్లాడిన తీరు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ పర్యటనకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహానికి ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సాయంత్రం మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన ఒక మధురానుభూతిని మిగిల్చింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈరోజు మా నివాసంలో ఆతిథ్యం ఇవ్వడం ఒక గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఆయన చూపిన ఆత్మీయత, ఆప్యాయత, మాతో ఎంతో ఉదారంగా సంభాషించిన తీరు ఈ సందర్భాన్ని మా అందరికీ ఎంతో ప్రత్యేకంగా మార్చాయి. ఆయనతో గడిపిన ప్రతి క్షణం మాకు చాలా విలువైంది. మా ఆహ్వానాన్ని మన్నించి, ఎంతో దయతో మా నివాసానికి వచ్చినందుకు గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఆయన అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు కూడా ధన్యవాదాలు" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చెస్ లో విశేషంగా రాణిస్తున్న నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ను అభినందించారు. అనంతరం, చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడంపై చంద్రబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :