Sunday, 26 July 2026 08:21:00 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె వారపు సంత, గేటు వేలం పాటలు రసాభస

Date : 09 April 2026 09:53 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : తంబళ్లపల్లె పంచాయతీ వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు రసాభసా గా మారి ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలం పాటలు ప్రారంభించగా హాజరైన సభ్యులు పంచాయతీలో వారపు సంత ఎక్కడ నిర్వహిస్తున్నారో ప్రకటించాలని, మూడు చోట్ల వారసంత నిర్వహణ లేకుండా చూడాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వారపు సంత నిర్వాహకులు పంచాయతీకి బకాయిలు ఉన్నారని వాటి లెక్క తేల్చాలని నిలదీశారు. కనీసం బస్టాండ్ గేటు వేలం పాటలు నిర్వహించడానికి కార్యదర్శి ప్రయత్నించగా సభలో గందరగోళం నెలకొనడంతో విధులేని పరిస్థితిలో మరో మారు వారపు సంత వేలం పాటలు వాయిదా వేస్తూ తదుపరి వేలం పాటల తేదీ ఖరారు చేస్తామని ప్రకటించడంతో సభ్యులు శాంతించారు. తంబళ్లపల్లెలో ప్రస్తుతం పాత బస్టాండ్ వద్ద శనివారం, సోమవారం గంగమ్మ గుడి వద్ద సాయంత్రం క్రాస్ రోడ్ లో9 సంతలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ సంతల నిర్వహణ అయోమయంగా మారడం ట్రాఫిక్ సమస్య, వాహన రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. వారపు సంతకు పాత హై స్కూల్ వెనుక ప్రభుత్వం కేటాయించిన ఎకరం స్థలం లో సంత నిర్వహణకు అధికారులు చొరవ చూపించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వెంటనే వారపుసంతను పాత ఐటిఐ గ్రౌండ్లో తాత్కాలికంగా నిర్వహించి తదుపరి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేసి సంతను అక్కడకు మార్చితే తంబళ్లపల్లె మధ్యలో సంత ఉండి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. గంగమ్మ గుడి వద్ద ఉన్న వారపు సంత పరసతోపు పంచాయతీకి చెందినది కాబట్టి అక్కడ సంత నిర్వహణకు ఏర్పాట్లు చేసి అదే విధంగా గొర్రెల సంతకు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇటు తంబళ్లపల్లి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు. సంబంధిత రెండు పంచాయతీల కార్యదర్శిలు, మండల స్థాయి అధికారులు చొరవచూపి రెండో సంచులు అభివృద్ధి చెంది పంచాయతీల ఆదాయం పెరగడానికి కృషి చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: