నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రాక్టర్లో నుంచి పడి వ్యక్తి మృతి ట్రాక్టర్ లోంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం, బండమీద కొత్తపల్లికి చెందిన శేఖర్ రెడ్డి(45), మమత దంపతులు గత కొన్నేళ్లుగా మదనపల్లె మండలం, బయ్యారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. శేఖర్ రెడ్డి బోరు బండి పనులకు వెళ్తూ జీవనం చేసేవాడు. తోటి స్నేహితులతో కలిసి బోరు ఫిట్ చేసే ట్రాక్టర్ లొఇ ముదివేడుకు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ని ముదివేది క్రాస్ వద్ద ట్రాక్టర్లో నుంచి అదుపుతప్పి జారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. మార్గమధ్యంలో శ్రీనివాసపురం వద్ద శేఖర్ రెడ్డి మృత్యువాత పడ్డాడు. మృతుడికి కుమార్తె రమ్య, కుమారుడు శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News