నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు సంస్థ 30వ వసంత వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . మదనపల్లె మండలం, అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా 30వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యం . ఉదయ్ కార్తికేయ రెడ్డి మరియు జి. దేవేంద్ర రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి , వెలుగు సంస్థ వ్యవస్థాపకురాలు కీర్తి శేషులు పద్మజ పాల రాతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . వెలుగు సేవాసదన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ ఆర్ . భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వెలుగు సంస్థ దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం1997 సం ||లో ప్రారంభించిన వెలుగు సంస్థ నిరంతర సేవలను అందిస్తూ ఎంతో మంది దాతలు , పెద్దల సహాయ సహాకారంతో నేడు 30 వ వసంతంలోకి అడుగు పెట్టిందని , ఇంక ముందుముందు ఎన్నో వసంతాలు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులు ఆకట్టుకునే నృత్య ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతరం ముఖ్య అతిథులుగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి మరియు జి. దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా అందరు వెలుగు సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. జి. దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ వెలుగు సంస్థ ఇంతమంది దివ్యాంగులకు మరియు వృద్దులకు నిరంతర సేవలు అందిస్తున్న వెలుగు సెక్రటరీ యం . ఉదయ్ మోహన్ రెడ్డి సేవలను కొనియాడుతూ శాలువాతో సత్కరించారు. రాబోయే రోజుల్లో కూడా వెలుగు సంస్థ మరింత అభివృద్ధి చెంది మరెంతో మందికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 1997లో ప్రారంభమైన వెలుగు సంస్థ నేడు 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, ప్రభుత్వ అధికారులు, సేవా సంస్థలు, సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి గ విచ్చేసిన జి. దేవేంద్ర రెడ్డిని శాలువాతో సత్కరించి, మొమెంటోను అందజేశారు. చివరిగా అందరికి స్నాక్స్ మరియు కేక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి మరియు జి. దేవేంద్ర రెడ్డి , వెలుగు సెక్రటరీ యం . ఉదయ్ మోహన్, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ పి. లీనా కుమారి , సోషల్ వర్కర్ యం . గీత సిబ్బంది, చిన్నారులు మరియు వృద్దులు పాల్గొన్నారు .
Reporter
Namitha News