నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు పెంపకం పై స్పందించిన స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి పాఠశాలకు రూ 20వేల విరాళం అందించారు. ఆయన స్ఫూర్తితో ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ పాఠశాల ప్రాంగణంలో పెరటి తోటలు పెంపకం తో పాటు ఖాళీ స్థలంలోని రాళ్లగుట్ట తొలగించడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తున్నాడు. మోడల్ స్కూల్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు మనవిగా భావించి ఖాళీ స్థలాలలో పెరటి తోటలు పెంచితే ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోపాటు పర్యావరణ కాలుష్య నివారణ అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉంది
Reporter
Namitha News