Sunday, 26 July 2026 11:37:44 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో సైబర్ సెక్యూరిటీ ఆధారిత ఇంటర్నల్ హ్యకథాన్ -2026

Date : 08 January 2026 06:13 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 08 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఆధారిత ఇంటర్నల్ హ్యకథాన్ -2026 కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్.వి.ఎస్ గంగ దేవి లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ పరిధిలోని డేటా, నెట్‌వర్క్‌లు, కంప్యూటర్ సిస్టమ్‌లు మరియు ఆన్‌లైన్ సమాచారాన్ని హ్యాకింగ్, సైబర్ దాడులు, మాల్వేర్ వంటి ప్రమాదాల నుంచి భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో డిజిటల్ సరిహద్దులను కాపాడటం ప్రతి సైబర్ సెక్యూరిటీ నిపుణుడి బాధ్యతగా మారిందని అన్నారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, టీమ్ వర్క్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించబడింది అని అన్నారు. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు వేదికను అందించడానికి మరియు తద్వారా నూతన ఆవిష్కరణల సంస్కృతిని మరియు సమస్య పరిష్కార ఆలోచనను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, న్యూ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరము దేశం వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ముందుగా యూనివర్సిటీ లో ఇంటర్నల్ హ్యకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించి, అందులో ప్రతిభ కనపరిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ పోటీలో క్రిప్టోగ్రఫీ, వెబ్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్స్, రివర్స్ ఇంజినీరింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఆధారిత ఛాలెంజ్‌లను పరిష్కరించి దాగి ఉన్న రహస్య కోడ్ లను గుర్తించాల్సి ఉంటుంది అని అన్నారు. మొత్తం 8 గంటల పాటు సాగే ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేవారు పరిమిత సమయంలో పరస్పరం సహకరించుకుంటూ సృజనాత్మక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలన్నారు. హ్యాకథాన్‌ను మూడు దశలుగా నిర్వహిస్తూ, మొదటి దశలో ప్రాథమిక మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, రెండవ స్థాయిలో ప్రాథమిక ఛాలెంజ్‌లు, మూడవ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయి భద్రతా సమస్యలను పరిష్కరించి దాగి ఉన్న రహస్య కోడ్ (ఫ్లాగ్) ను గుర్తించాలి అని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎమ్.లక్ష్మీ ప్రీతి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: