నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ లోని చెత్తాచెదారం, కళేబరాలు, కుళ్ళిన వాసనతో పేరుకుపోయిందని దీంతోపాటు ఈ దుర్గంధం మొత్తం గత వర్షాలకు అక్కమ్మచెరువు నీటిలో కలిసి నీరు కలుషితమైనట్లు గ్రామస్తుల ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం గ్రామస్తులు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆయన వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రదేశాన్ని పరిశీలించి అక్కమ్మ చెరువులో కాలుష్యాన్ని గుర్తించి పరిష్కారానికి గ్రామంలోని చెత్త చెదారాన్ని మొలకలచెరువు రహదారులో ప్రభుత్వ స్థలంలో తరలించడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News