Sunday, 26 July 2026 09:18:35 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎర్రచందనం, చెక్కలపై రాజా-రాణి బొమ్మలు లకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన మిట్స్

Date : 06 February 2026 07:59 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : దక్షిణ భారతదేశం అంతటా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన, ఎర్రచందనంతో తయారు చేసిన శతాబ్దాల నాటి తిరుపతి జిల్లాలోని లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మలకు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లె లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) వారు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చెన్నై జీఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. లక్ష్మీగారిపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ప్రసిద్ధి చెందాయి అని మరియు సాంప్రదాయకంగా పెళ్లికూతుళ్లకు వివాహ బహుమతిగా ఇస్తారు అనిఇవి వారి బొమ్మల కొలువు సేకరణలో మొదటి భాగంగా ఉంచుతారని ఆయన అన్నారు. రిజిస్ట్రీకి సమర్పించిన పత్రాల ప్రకారం, లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మల కళ తిరుపతి జిల్లాలోని సెట్టిగుంట పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది అని, ఈ జీఐ దరఖాస్తును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్టిస్టిక్ వుడెన్ టాయ్స్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరు పై దాఖలు చేసినట్లు ఆయనన్నారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమం లో అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :