నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 30 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన 15 మంది ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (CATC-III)లో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) లో నిర్వహించిన జాతీయ స్థాయి ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ అటాచ్‌మెంట్ శిక్షణా శిబిరంలో 0.22 రైఫిల్ ఫైరింగ్, స్కిట్ ప్రదర్శన, డ్రిల్, ఏరోమోడలింగ్ డిజైన్, పారాచూట్ శిక్షణ, డ్రోన్ పైలటింగ్ వంటి వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న క్యాడెట్లతో పోటీపడుతూ శారీరక శిక్షణతో పాటు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, వాదోపవాదం వంటి మేధోపరమైన పోటీల్లో మిట్స్ క్యాడెట్లు తమ ప్రతిభను చాటుతూ మొత్తం ఏడు పతకాలు సాధించారని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, సమస్యలను సమర్థంగా పరిష్కరించే నైపుణ్యం, సమయపాలన మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతాయని అన్నారు. శిక్షణా శిబిరంలో గ్రూప్ కెప్టెన్ ఆర్.జె. ఆత్రే, కమాండింగ్ ఆఫీసర్, 11(A) ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్నికల్) ఎన్‌సీసీ, తిరుపతి, ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఎన్.సి.సి ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News