Sunday, 26 July 2026 04:47:16 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి

Date : 12 January 2026 12:10 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాలు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి. అప్పలరాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం అపాలని కోరుతూ. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పి.డి. చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంంచిం. నిని గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీ.డీ. చట్టాన్ని రైతు నాయకుడు ఎం.అప్పలరాజు పై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా సక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్య కారకంగా మారుతుం, మత్స్య సంపద దెబ్బతింటుంది. మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెప్పుతున్న, దానికి విరుద్ధంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవదాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. వారికి అండగా ఉన్నాడన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజు పై ప్రభుత్వం పి.డి. చట్టాన్ని ప్రయోగించిం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బందాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది ఏ మాత్రం సరైనది కాదు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడి చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తున్నది. ఈ రకమైన నిరంకుశ వైఖరిని మానుకోవాలని కోరుచున్నాము. తక్షణమే అప్పలరాజు పై పెట్టిన పీ.డీ, చట్టాన్ని రద్దు చేయాలని, జైలు నుండి విడుదల చేయాలని కోరుచున్నాము. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో 1/70 చట్టానికి భిన్నంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములలో వేసిన మొక్కజొన్న ఇతర పంటలను బుట్టాయిగూడెం తాసిల్దార్, ఎస్పై, పోలీసులు కలసి ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సైని ప్రశ్నించిన గిరిజనుల పైన ఎస్సై బౌతికంగా దాడి చేశాడు. మహిళలు అని చూడకుండా మగ పోలీసులే మహిళలను జాకెట్లు చింపి చేయి పట్టుకుని పక్కకు లాగివేశారు. అడ్డువచ్చిన గిరిజన రైతును లాఠీతో కొడితే తల పగిలి రక్తగాయమైంది. ఈ ఘటనలో దౌర్జన్యం చేసిన పోలీసుల మీద, రెవెన్యూ అధికారుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా గిరిజనులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం లో విద్యార్ధి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ రకంగా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై పెట్టిన పి.డి. చట్టం, ఏలూరు జిల్లా ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు, విద్యార్థులపై పెట్టిన రౌడీషీట్ అన్నింటిని ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భందాన్ని ఆపాలని ప్రజాసంఘాల తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: