నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : సాహితీ దిగ్గజం, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పుట్టపర్తి నారాయణ ఆచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధృవతార అని వ్యాఖ్యానిస్తూ 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి 'సరస్వతీ పుత్ర' బిరుదును సార్థకం చేసుకున్న మహనీయులు. అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అయితే, వీరి విద్యాభ్యాసం మరియు సాహిత్య ప్రస్థానం ఎక్కువగా ప్రొద్దుటూరు (కడప జిల్లా) ప్రాంతంతో ముడిపడి ఉంది. ఈయన మన ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన రచించిన 'శివతాండవం' వంటి కావ్యాలు తెలుగు సాహిత్యానికి వెలకట్టలేని ఆభరణాలు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించడం మన బాధ్యత." అని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ పి. రాజా రమేష్ గారు ఆర్ఐ కె. సురేష్ కుమార్ రెడ్డి ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
Admin
Namitha News