Monday, 27 July 2026 02:12:04 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కనీస అభ్యసన సామర్థ్యాల మెరుగుదల లక్ష్యం

ఎఫ్‌ఎల్‌ఎన్‌ బేస్‌లైన్‌ సర్వే ప్రారంభం - డిఈఓ సుబ్రహ్మణ్యం

Date : 24 November 2025 06:31 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 24 : విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేందుకు ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బేస్‌లైన్‌ సర్వేను ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన 3,689 ప్రాథమిక పాఠశాలల్లో 1,11,587 మంది విద్యార్థులపై ఈ సర్వేను లీప్ యాప్‌ ద్వారా సోమవారం ప్రారంభించారని చెప్పారు. సర్వేలో డైట్ విద్యార్థులు, సీ ఆర్ పీలు, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు పాల్గొంటున్నారని వివరించారు. విద్యార్థుల బలహీనతలు, వెనుకబడిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ వంటి అంశాలను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం స్పష్టంగా గుర్తించగలదని చెప్పారు. దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రిమిడియల్ బోధన, ప్రత్యేక శిక్షణలు, విద్యా నాణ్యత మెరుగుదల కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. తదనంతరం డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి రాయచోటి మండలం అబ్బవరం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సర్వే నిర్వహణను పరిశీలించి సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అంతిమ లక్ష్యం 1–5 తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకాలను సులువుగా చదవడం, గణితంలోని ప్రాథమిక లెక్కలు చేయగలగడం, తద్వారా ఉన్నత తరగతుల్లో అభ్యాసంలో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాత్రోపాధ్యాయిని సాగరిక, సిఆర్‌పి విజయలక్ష్మి, ఉపాధ్యాయిని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :