నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 07 : దశాబ్దాలుగా అణగారిన మాదిగ జాతికి ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఊపిరి పోయగా మందకృష్ణ మాదిగ రిజర్వేషన్లు సాధించి చరిత్ర పుటలో నిలిచి మాదిగల ఆశాజ్యోతి గా నిలిచినట్లు ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్ లు కొనియాడారు. మంగళవారం తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎమ్మార్పీఎస్ జిందాబాద్,మందకృష్ణ మాదిగ, నరేంద్ర మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో గోపిదన్నె మల్లికార్జున, మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు , టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News