నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 01 ః తంబళ్లపల్లె మండలం లో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్లు మా దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదని ఉక్కు పాదం మోపుతామని ఎస్సై టి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం వరసతోపు పంచాయతీ ఏటిగడ్డ పల్లెలో ప్రజలతో మమేకమై వారికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఎక్కడైనా జూదం, కోడి పందాలు, గంజాయి, బెల్ట్ షాపుల నిర్వహణ, బహిరంగ మద్యం సేవించడం, విద్యార్థినులు,మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సూచించారు. ప్రజలు సైతం సహకరించి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన పోలీసుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News