Sunday, 26 July 2026 01:13:18 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే - నిసార్ అహ్మద్

Date : 23 December 2025 05:01 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మన పథం‌ అభివృద్ధి, మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే -- నిమ్మనపల్లె వైసిపి నాయకులతో సమావేశమైన నిసార్ అహ్మద్... వివాదంపై ఆరా... నాయకులకు అండగా వుంటామని భరోసా... అనవసర వివాదాలకు దూరంగా వుందాం, కూటమి పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా వుండాలని నిమ్మనపల్లె వైసిపి నాయకులకు నిసార్ అహ్మద్ సూచించారు. ‌మంగళవారం నిమ్మనపల్లెలో వైసిపి నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమై ఆదివారం రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు.‌ జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హజరైనారు. నిసార్ అహ్మద్ కు సాదర స్వాగతం పలికారు. నాయకులను పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నిమ్మనపల్లెలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ 2.0 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు. గతంలో జగన్మోహన్ సిఎంగా అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ‌మళ్లీ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అందుకోసం అందరూ కలిసి పని చేద్దామని అన్నారు. ‌చిన్ని, చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చూసుకోవడం, తద్వారా కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు కలిగి విధంగా చేయవద్దని సూచించారు. ఇప్పుడు కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త, నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటానే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ‌మన పథం అభివృద్ధి అని, మన లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయడమే అన్నారు.‌ అభివృద్ధి, సంక్షేమానికి మళ్ళీ వైసిపి ప్రభుత్వామే రావాలని ప్రజలు కోరుతున్నారని, ఇందుకు అనుగుణంగా మనం ప్రజలకు చేరువ కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హేమంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రఫీ , షరాఫత్, నూర్ మొహిద్దీన్, నాగరాజ్, వెంగంవారిపల్లి శ్రీనివాసులు రెడ్డి, వెంగంవారిపల్లె, దావూద్, శ్రీనివాసులు రెడ్డి, హోటల్ రఫీ, నరేష్, యోగానంద రెడ్డి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :