Sunday, 26 July 2026 04:38:02 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా!

Date : 07 June 2026 09:53 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం పేరుకేమో గొప్ప అన్ని సమస్యలే పట్టించుకునే వారు లేక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. జిల్లా స్థాయి అధికారులు వచ్చి వెళుతున్న ఒక్క సమస్య పరిష్కారం కాక పోవడం విచారకరం. తంబళ్లపల్లె సచివాలయం మరమ్మతులకు నోచుకోక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. నడిబొడ్డులోని తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకొని మరమ్మతులకు నోచుకోక సుదూర ప్రాంతంలోని పి ఆర్ గెస్ట్ హౌస్ లో నిర్వహిస్తున్నారు.తంబళ్లపల్లెకు రెగ్యులర్ కార్యదర్శి లేక ప్రధాన ఆదాయ వనరులైన వారపు సంత, బస్టాండ్ గేటు వేలంపాటలు నిర్వహణ లేక లక్షలాది రూపాయలు నష్టపోతున్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెంటాడుతుంది. ఇంటి పన్నులు వసూలు చేసినంత తొందర ఆదాయ వనరుల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలో తంబళ్లపల్లెలో నిర్మించిన మురికినీటి కాలువలపై ప్రమాదాలు జరుగుతున్నా మూతలు వేయలేని దుస్థితి కొనసాగుతోంది. తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో నిత్యం వాహనాల రద్దీ తో ట్రాఫిక్ సమస్య తోపాటు పాఠశాలలు, ఆసుపత్రిల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తంబళ్లపల్లె పాత బస్టాండ్, క్రాస్ రోడ్ బస్ షెల్టర్లు వద్ద మహిళలకు మరుగుదొడ్లు లేక ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా మహిళల పట్ల ప్రేమ ఒలకపోసే నాయకులకు, అధికారులకు సమస్య కాన రాకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం,సచివాలయం మరమ్మత్తు, కాలవలపై మూతలు, మహిళలకు మరుగుదొడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సమస్య, వారపు సంత స్థలం, డైలీ మార్కెట్, వారపు సంత, బస్టాండ్ గేటు నిర్వహించి ఆదాయ వనరు పెంపు, మల్లయ్య కొండకు వెళ్లే రహదారులు విస్తరణ, ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ చేపట్టాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: