Sunday, 26 July 2026 12:22:07 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి జిల్లా ఏర్పాటుతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష

Date : 26 November 2025 07:14 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష - ఆర్టీసీ 1,2 డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హర్షం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు మదనపల్లె : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిందని మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ప్రస్తుతం జిల్లాగా ఏర్పాటు చేసి ఆ హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.గత వైసిపి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజల మనోభావాలను,ప్రజాసంఘాల ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా మదనపల్లిని జిల్లా చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.దీంతో అప్పుడు తెలుగుదేశం పార్టీలో తమతోపాటు వివిధ ప్రజాసంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు.వైసిపి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మదనపల్లి జిల్లా కోసం పోరాట పోరాటాలు చేశామని గుర్తు చేశారు.ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన,ప్రశాంతమైన వాతావరణం కలిగిన మదనపల్లి జిల్లాగా ప్రకటించిన ఈరోజు ఇక్కడి ప్రజలకు పండుగ రోజు అని కొనియాడారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు మదనపల్లి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :