Sunday, 26 July 2026 01:12:41 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 28 February 2026 08:59 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం మండలం గొంగివారిపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగుల పెన్షన్ ను లబ్ధిదారుడైన ఎస్.రమేష్ ఆయన ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నది తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ కాలవలో కలవకుండా లీకేజ్ లేకుండా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, సోమల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :