నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 01 : మదనపల్లి పట్టణం లో పలుచోట్ల లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు అందిస్తున్న అధికారులతో పాటు కలిసి పంపిణీ చేస్తున్న కూటమి నాయకులు. నేటి ఉదయం నుండీ పెన్షన్ పంపిణీ చేస్తున్న కార్యక్రమం ను పర్యవేక్షణ చేసిన సందర్బంగా లబ్దిదారులకు పింఛన్లు అందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా సమయానికి అందుతున్న పెన్షన్ పై హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు.. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయాన్నే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలో నెలకు 16 కోట్ల రూపాయలు పైగా పింఛన్లు పంపిణీ కూటమి ప్రభుత్వ అందిస్తుందని, మనందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా రుణపడి ఉండాలని పేర్కొన్నారు
Reporter
Namitha News