నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 08 : అన్నమయ్య జిల్లా రాయచోటి నందు కురుబ సంఘం నాయకులు శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర కురుబ సంఘం నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ కర్ణాటక సంగీతం తాత్వికవేత్త పేదల పట్ల ప్రేమాభిమానాలు కలిగినటువంటి శ్రీ భక్త కనకదాస వారిని వేనోళ్ళ కొనియాడారు. అనంతరం అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తరిగొండ ఈశ్వరయ్య మాట్లాడుతూ అంతటి మహానుభావుల యొక్క జయంతిని నిర్వహించేటువంటి భాగ్యం కలిగినందుకు జీవితం ధన్యమని వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా ఆదర్శప్రాయంగా తీసుకోవాలని తెలిపారు .అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు కురువ సంఘం లయన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తాత్వికవేత్త సామాజిక స్పృహ సంగీత కళాకారులు హరికథా పితామహులు అయినటువంటి శ్రీ భక్త కనకదాస గారి యొక్క జీవితం ఆదర్శనీయమని వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు .అనంతరం అడ్వకేట్ రవిశంకర్ మాట్లాడుతూ ధార్మికవేత్త అయినటువంటి శ్రీ భక్త కనకదాసు గారి జీవితాన్ని ఎల్లవేళలా ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా నిలుపుకోవాలని వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంలో ఎల్లవేళలా గుర్తుంచుకొని మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కురుబ నాయకులు సుధాకర్, అంకి శెట్టిపల్లి జబ్బల రెడ్డప్ప, మదనపల్లి మడికయుల శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, మురళీ కుమార్, రెడ్డన్న, నాగేంద్ర, రమణయ్య, రవి, చంద్ర మోహన్ తదితరులు మరియు సంఘ సభ్యులు అందరూ విరివిగా పాల్గొన్నారు
Reporter
Namitha News