నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో కృత్రిమ మేధస్సు, సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ & రీసెర్చ్ అవకాశాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఐటీ మద్రాస్ ఆర్&డి అడ్వైజర్ ప్రొఫెసర్ దండు రాధాప్రసాదరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా, వినూత్న పరిశోధనల ద్వారా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువ అధ్యాపకులు మరియు విద్యార్థులు స్టార్టప్‌లు, పేటెంట్లు, మరియు పరిశోధన ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తే, జాతీయ స్థాయిలో నిధులు పొందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, రక్షణ మంత్రిత్వ శాఖలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె.ఎస్. భానుమతి మరియు ఎస్ ఓ సి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతినిధి డాక్టర్ వీణ ఎస్ చక్రవర్తి లు పాల్గొని పరిశ్రమల్లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఉత్పత్తి నాణ్యత పెంచడం, తయారీ సమయం తగ్గించడం, ఖర్చులు నియంత్రించడం మరియు పర్యావరణహిత తయారీ విధానాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరియు సిలికాన్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ఆరోగ్యం, పరిశ్రమలు, రక్షణ, ఆటోమేషన్ మరియు స్మార్ట్ పరికరాల రంగాల్లో వీటి వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News