నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 15 : తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎంపిక పై నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు లోని అన్నా క్యాంటీన్ సమీపంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని నారా లోకేష్ జిందాబాద్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు..పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఒకరిని ఒకటి తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు..బస్టాండ్ ప్రాంతంలో భారీ బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి తో పాటు సిండికేట్ ఫార్మసీ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ, పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు
Reporter
Namitha News