నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఐకమత్యం చాటిన మత్స్యకార సహకార సంఘాలు - ఆప్కాబ్ చైర్మన్ గా యాదగిరి రాంప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - జిల్లా బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు మడితం రమణ హర్షం మదనపల్లె : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఐకమత్యం చాటడం శుభపరిణామమని అన్నమయ్య జిల్లా బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు మడితం రమణ హర్షం వ్యక్తం చేశారు.గురువారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు మత్స్యకార నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మడితం రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల ఎన్నిక బుధవారం విజయవాడలో రాష్ట్ర ఫిసిరిస్ కార్యాలయంలో జరిగింది.ఇందులో 13 జిల్లాల చైర్మన్లు కడపకు చెందిన యాదగిరి రాంప్రసాద్ ని ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి యాదగిరి రాంప్రసాద్ ఆప్కాబ్ చైర్మనుగా నియామక పత్రాన్ని అందజేశారు.అంతకు ముందు ఆప్కాబ్ తాత్కాలిక చైర్మన్ గా కొనసాగాలని జీవో నెంబర్ 417తో బిఎస్ నవీన్ కుమార్ ని కొనసాగించడం జరిగిందన్నారు.అప్పుడు సైతం రాయలసీమ వ్యక్తిని కేటాయించడం పట్ల తాము సంతోషాన్ని వ్యక్తం చేశామని,ప్రస్తుతం రాయలసీమ వ్యక్తి అయినా కడపకు చెందిన యాదగిరి రాంప్రసాద్ ఏకీగ్రీవం కావడానికి తాము పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు.కడప జిల్లా చెందిన వ్యక్తిని ఆప్కాబ్ చైర్మనుగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి మా సామాజిక వర్గంలో ప్రతి జిల్లా డి.ఎఫ్.ఎస్.సి చైర్మన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులంతా రుణపడి ఉంటామన్నారు.అనంతరం గౌరవ అధ్యక్షులు టి.కృష్ణమూర్తి మాట్లాడుతూ మత్స్యకారుల వెనుకబాటుతనాన్ని గుర్తించి బెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.బెస్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.నూతన చైర్మన్ మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేయాలని,మత్స్యకారులను అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు,అడ్వకేట్ సి.వి మూర్తి,రమణ,కేవి రమణ,నవీన్ కుమార్,కామేశ్వర,దొరస్వామి,శ్రీనివాసులు,వినయ్ కుమార్,రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News