నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 30 : తంబళ్లపల్లె మండలం లోని పాత నేరస్తులకు ఆదివారం యస్.ఐ. ఉమామహేశ్వర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉదయం ఆయన మండలంలోని రౌడీషీటర్లు, డేకాయిట్లు, సస్పెక్ట్ లను పోలీస్ స్టేషన్కు పిలిపించి సత్ప్రవర్తన కలిగి ఉండాలని, భవిష్యత్తులోఎలాంటి నేరాలకు పాల్పడరాదని, పాత నేరస్తులు అందుబాటులో ఉండాలని ఎక్కడైనా నేరాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏ ఎస్ ఐ నజీర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News