Sunday, 26 July 2026 10:29:27 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్

Date : 06 June 2026 06:42 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కూటమి పాలనలో ముస్లిం మైనారిటీలకు ఓరిగింది ఏమి లేదు... SIR పైన అప్రమత్తంగా ఉండాలి... ముస్లిం మైనారిటీ ఓట్లే వారి లక్ష్యం -- తనదైన శైలిలో వివరించిన మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ గతంలో విలువైన వస్తువులు లోహాలు, గుర్రాలు, పశువులు కలిగిన వారు గొప్ప వారని, నేడు ఓటు కలిగిన వ్వక్తులే గొప్ప వారని మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ పేర్కొన్నారు. తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌ పలు సూచనలు సలహాలు అందజేసినారు. స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియపై మదనపల్లె నియోజకవర్గం సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విలువ సూచనలు సలహాలు ఇచ్చారు. (BLA) బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ల జాబితా పునపరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలే తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో YSRCP అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగింపుకు గురికాకుండా పార్టీ తరఫున నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హేమాహేమీలకు ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరూ చూశారని ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఓటు విలువైనదే అని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఒక ఓటు తేడాతో గెలుపు ఓటమి చూసిన ఘటనలు వివరించారు. ముస్లిం మైనారిటీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి:- కూట‌మి పాల‌న‌లో మైనారిటీల‌కు ప్రోత్సాహం, గౌర‌వం మాత్ర‌మే కాకుండా క‌నీసం ర‌క్ష‌ణ కూడా కరువైంద‌ని నిస్సార్ అహ్మద్ ధ్వ‌జ‌మెత్తారు. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త‌ర్వాత మైనారిటీల ప‌క్షాన నిల‌బ‌డి రాజ‌కీయంగా ప్రోత్స‌హించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి కే ద‌క్కుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం SIR పేరుతో జ‌రుగుతున్న ఓట‌రు లిస్టు స‌వ‌ర‌ణ విష‌యంలో మైనారిటీల ఓట్ల పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమీలేదని నిస్సార్ అహ్మద్ అన్నారు.‌ YSRCP కి అండగా వున్న ముస్లింలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తీసుకుని వెళ్ళాలని వెల్లడించారు. రాష్ట్రంలో ముస్లిం వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వున్న ముస్లిం లకు ఇంత ప్రయోజనాలు చేకూర్చి వుండలేరని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమైందని నిస్సార్ అహమ్మద్ వివరించారు. YSRCP కి అండగా వున్న ముస్లిం లను డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని, తగ్గట్టుగా మనం వారికి వివరించాలని సూచించారు. వెన్నుపోటుకు రెండేళ్ళు... మైనారిటీలకు కూటమి చేసింది శూన్యం:- పేద‌లైన ముస్లింల ప‌రిస్థితిని ఆస‌రాగా చేసుకుని మోసపు హామీలు గుప్పించి ఓటేయించుకున్న చంద్రబాబునాయుడు, అధికారం లోకి వ‌చ్చాక ఏ ఒక్క‌టీ నెరవేర్చ‌కుండా వెన్నుపోటు పొడిచాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వ‌డం, అధికారంలోకి వ‌చ్చాక మోసం చేయ‌డం చంద్రబాబునాయుడుకు అల‌వాటైపోయింద‌ని మండిప‌డ్డారు. ముస్లిం మైనారిటీ వర్గాలను YSRCP నుంచి దూరం చేయడానికి కుయుక్తులు పన్నుడంలో చంద్రబాబునాయుడుకు మించిన వారు ఎవరూ లేరని ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామచంద్రారెడ్డి, ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్, నూరీ ఫాతిమా, రుహుల్లా, ఇషాక్ సాహెబ్, అప్పిరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు, YSRCP నాయకులు పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :