నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 19 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల లో భాగంగా ఆదివారం అంకురార్పణ కార్యక్రమం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం టిటిడి ఏఈఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి ల సారథంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు వందలాదిగా పాల్గొని స్వామివారి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోవెంకటేశ్వర ఆలయం సుందరీకరణ తో పాటు కోసువారిపల్లి పురవీధులు విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కృష్ణమూర్తి, నగేష్, మురళి మరియు కోసువారి పల్లి స్వామివారి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News