నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 : మహిళా లోకానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే. తంబళ్లపల్లె. జనవరి 3 ( నేటి మన దేశం ప్రతినిధి) సమాజంలో మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి మార్గదర్శి గా నిలిచినట్లు హెడ్మాస్టర్ రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం తంబాలపల్లి ఎంపీపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మహిళా టీచర్లు పద్మావతి, రెడ్డి రాధిక, సుగుణ లను పాఠశాల హెడ్మాస్టర్ తో పాటు కమిటీ చైర్మన్ ఆనంద్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో డైరెక్టర్ జై లలితమ్మ ఆదేశాలు మేరకు కన్వీనర్ ఆవుల నరసింహులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి, శైలజ, రమణ, తరిగొండ నరసింహులు పాల్గొన్నారు.) సమాజంలో మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి మార్గదర్శి గా నిలిచినట్లు హెడ్మాస్టర్ రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం తంబాలపల్లి ఎంపీపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మహిళా టీచర్లు పద్మావతి, రెడ్డి రాధిక, సుగుణ లను పాఠశాల హెడ్మాస్టర్ తో పాటు కమిటీ చైర్మన్ ఆనంద్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో డైరెక్టర్ జై లలితమ్మ ఆదేశాలు మేరకు కన్వీనర్ ఆవుల నరసింహులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి, శైలజ, రమణ, తరిగొండ నరసింహులు పాల్గొన్నారు.
Reporter
Namitha News