Monday, 27 July 2026 11:52:51 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జపాన్ లో మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇచినోసేకి కళాశాల ను సందర్శించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

Date : 26 November 2025 05:13 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 26: అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నుండి డాక్టర్ వంశీ బండి నేతృత్వంలో బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న 7 మంది విద్యార్థుల బృందం జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇచినోసేకి కళాశాలను జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించిన సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2025లో పాల్గొన్నట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. డాక్టర్ వంశీ బండి నేతృత్వంలో సి.చెర్షితా రెడ్డి, కే.హేమ చరిత, అనికేత్ అరుణ్ సస్మాల్,ఏ.లోకేష్,కే.తేజ శ్రీ ,ఎస్.వైష్ణవి, ఎమ్.తేజేశ్వర్ రెడ్డి ఈ సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్శనలో కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రిక్ అటానమస్ వెహికల్స్ ఇంటర్నేషనల్ కో -క్రియేషన్ ప్రాజెక్ట్ ఆధారంగా రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ల్యాబ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై అనుభవాత్మక శిక్షణ పొందినట్లు ఆయన అన్నారు. విద్యార్థులు మురకోమి గ్రూప్ పరిశ్రమను సందర్శించి జపాన్ ఆటోమోటివ్ రంగంలో జరుగుతున్న పరిశోధనలు, తయారీ విధానాలను తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మిట్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల మధ్య పెరుగుతున్న అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇచినోసేకి కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ జన్య కొబయాషి నేతృత్వంలో జరిగిన అవగాహన ఒప్పందం చర్చలు ఈ సుసంపన్నమైన కార్యక్రమానికి పునాది వేశాయి అని, ఈ భాగస్వామ్యం విద్యార్థులకు విద్యా మరియు పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం, అత్యాధునిక సాంకేతికతలు బహిర్గతం కావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జపాన్ వెళ్లిన విద్యార్థులను మరియు డాక్టర్ వంశీ బండి లను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, ఇంటెర్నేషన్ రిలేషన్స్ డీన్ డాక్టర్. శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు.విజయ లక్ష్మి, అధ్యాపక బృందం తదితరులు అభినందనలు తెలియజేసారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :