నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి - జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా మదనపల్లె : దేశభక్తి,త్యాగం,బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా పోరాడిన తొలి యోధులలో టిప్పు సుల్తాన్ ఒకరని,ఆయన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎపి కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా అన్నారు.సోమవారం టిప్పు సుల్తాన్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ పాలనలో అన్ని మతాల వారు సమాన గౌరవం పొందారని,మత సామరస్యానికి లౌకికవాదానికి నిదర్శనమని గుర్తు చేశారు.వ్యవసాయం,వాణిజ్యం,సైనిక రంగాల్లో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనియాడారు.టిప్పు సుల్తాన్ 1799 మే 4వ తేదీన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నం కోటను రక్షిస్తూ వీరమరణం పొందారని గుర్తుచేశారు.నేటికి ఆయన మరణించి 227 ఏళ్లు పూర్తయ్యాయన్నారు.దక్షిణ భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తులలో టిప్పు సుల్తాన్ ఒకరని కొనియాడారు.
Reporter
Namitha News