నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ పరిధిలోని డ్రోన్ టెక్నాలజీ క్లబ్ సహకారంతో “ఫ్లైట్ విత్ రెస్పాన్సిబిలిటీ – డ్రోన్ ఆపరేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్” అనే అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన డ్రోగో డ్రోన్స్ సంస్థ డ్రోన్ పైలట్ అండ్ ఇంజనీర్ బి. నంద కిషోర్ బరిణెపల్లి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు డ్రోన్‌లను బాధ్యతాయుతంగా వినియోగించే విధానాలు, డ్రోన్ ఆపరేషన్ సేఫ్టీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ (DGCA) నిబంధనలు, రిమోట్ పైలట్ ట్రైనింగ్ మరియు రిమోట్ పైలట్ సర్టిఫికేషన్ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రకృతి విపత్తులు, వరదలు, మెడికల్ ఎమర్జెన్సీలు, అగ్ని ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో డ్రోన్‌ల వినియోగం ద్వారా ప్రమాద తీవ్రతను ఎలా తగ్గించవచ్చో వివరించడంతో పాటు, వ్యవసాయ రంగంలో పంటలపై ఎరువులు, పిచికారీ, లాజిస్టిక్స్ మరియు రక్షణ రంగాల్లో డ్రోన్‌ల ప్రాముఖ్యతను వివరించారు. డ్రోన్ బ్యాటరీ సేఫ్టీ, గవర్నింగ్ ఏజెన్సీల పాత్ర మరియు యుద్ధ సమయంలో డ్రోన్‌ల ద్వారా సైనికులకు సరఫరాలు, ఆయుధాలు అందించే విధానాలపై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిషత్తులో డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో మిట్స్ డ్రోన్ క్లబ్ & స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రెడ్డి హేమంతా , డాక్టర్ ఐ. అరుణ్, డాక్టర్ పృథ్వివి దీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజ్వాన్, ఫ్యాకల్టీ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News