నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి - శ్రీ విద్యా వికాస్ విద్యార్థులకు ప్రముఖుల సూచనలు - అట్టహాసంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు మదనపల్లె : విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలని విద్యార్థులకు ప్రముఖులు సూచించారు.ఆదివారం శ్రీదేవి గార్డెన్స్ నందు శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ మరియు వీడ్కోలు సమావేశం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ ఇర్రి శివ శంకర్,ప్రముఖ మోటివేషన్ స్పెషలిష్ట్ రామ్మూర్తి,గుర్రంకొండ న్యూలిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కరస్పాండెంట్ శీజ,విశ్వం ఇంజనీరింగ్ కళాశాల డీన్ శ్రీనివాసులు రెడ్డి,బాలాజీ క్లినిక్ వైద్యులు డాక్టర్ సతీష్,ప్రముఖ గాయిని కళ్యాణి,లాక్మీ అకాడమీ డైరెక్టర్ సౌజన్య,వెంకటేష్,పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ,బ్రిలియంట్ హైస్కూల్ కరస్పాండెంట్ మొరంపల్లి సహదేవ రెడ్డి,బలకవారిపల్లె ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు,కొత్తవారిపల్లి నాగార్జున నాయుడు,రెడ్డెప్ప నాయుడు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని,ఇక్కడ క్రమశిక్షణ,సన్మార్గంతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునన్నారు.అదేవిధంగా అధ్యాపకులు చెప్పే పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని తల్లిదండ్రులు,అధ్యాపకుల సూచనలు పాటించి అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.అనంతరం ప్రిన్సిపాల్ శివశంకర్ మాట్లాడుతూ తమ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతోందన్నారు.తొలి ఏడాదిలోని తమ కళాశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక స్పృహ,దేశభక్తిని పెంపొందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.తమ ఆహ్వానం మేరకు వార్షికోత్సవ సమావేశానికి హాజరై జయప్రదం చేసిన అతిథులు,విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
Reporter
Namitha News