నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : టిడిపి ఆవిర్భావం నుండి తంబళ్లపల్లె మండలంలో పార్టీకి వెన్నుముకగా నిలిచిన మైనార్టీ నేత పీర్ల మాబు (54) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఆయన మృతికి టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు,రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, కృష్ణమూర్తి నాయుడు, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి,పురుషోత్తం, సుధాకర్ రెడ్డి,గంగుల్ రెడ్డి,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు, బాలకృష్ణారెడ్డి, శివకుమార్,మణి,మాజీ జెడ్పిటిసి రామచంద్ర, కాలా నారాయణ, సురేంద్ర, సోమశేఖర్, మీసాల భాస్కర్ నాయుడు,మాజీ సర్పంచులు సుధాకర్, శంకర్,వెంకటరమణ, రామచంద్రారెడ్డి,స్వామి రెడ్డి, అల్లావుద్దీన్, టిడిపి నాయకులు, ప్రజా సంఘాలు, మైనార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.
Reporter
Namitha News