Monday, 27 July 2026 04:40:02 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎస్పీ

Date : 02 December 2025 04:42 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా పోలీసు కుటుంబాలకు ఆరోగ్య భరోసా పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎస్పీ.. మెరుగైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వెల్లడి... అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం ఉదయం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సంక్షేమమే జిల్లా పోలీసు శాఖకు ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు... పోలీసు సిబ్బందికి వారి కుటుంబాలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు...వెల్ఫేర్ ఆసుపత్రి కేవలం భవనం కాదు, మా సేవా యోధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తీసుకున్న మొదటి ఆరోగ్య భరోసా" అన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు మరియు అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. తరచుగా ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన డిఎంహెచ్ఓ, రాయచోటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి , రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, డి.లక్ష్మీప్రసాద్, డాక్టర్లు రామరాజు, రాధిక, అబ్దుల్ లతీఫ్, ఏఏఓ జె.త్రినాథసత్యం, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :