Sunday, 26 July 2026 11:21:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు - జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 15 January 2026 06:41 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 15 : పోలీస్ కార్యాలయంలో గురువారం అభినవ భారవి, కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి కవిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గొప్ప సంస్కర్త త్రిపురనేని అని తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. తెలుగు సాహిత్యంలో మరియు సామాజిక సంస్కరణోద్యమంలో ఒక ధృవతార చౌదరి గారు. ఆయనకు 'కవిరాజు' అనే బిరుదు కలదు. అలాగే ఆయన పాండిత్యానికి మెచ్చి 'అభినవ భారవి' అని కూడా పిలుస్తారు. ఆచారాల పేరుతో సాగుతున్న మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో హేతువాదాన్ని ప్రచారం చేశారు. ఆయన కలం నుండి జాలువారిన 'సూతపురాణం', 'కురుక్షేత్ర సంగ్రామం', 'శంబుక వధ' వంటి రచనలు తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించాయి. పురాణాల్లోని పాత్రలను సరికొత్త కోణంలో విశ్లేషించిన ఘనత ఆయనది. లండన్ వెళ్ళి బారిస్టర్ చదివిన ఆయన, వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ, తన జీవితాన్ని సమాజ సేవకు, అక్షర సేద్యానికే అంకితం చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప మేధావి త్రిపురనేని రామస్వామి చౌదరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వి.జె.రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: