Monday, 27 July 2026 11:53:05 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆత్మకూరు లో సి.ఐ. గంగాధర్ ఆధ్వర్యంలో మమ్ముర తనిఖీలు చేపడుతున్న పోలీసులు

నెల్లూరు జిల్లాలో నేర చరిత్రపై ఉక్కు పాదం మోపుతున్న జిల్లా ఎస్పీఅజిత వేజెండ్ల

Date : 07 December 2025 07:50 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - డిసెంబర్ 07 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల కట్టుడికి వివిధ రకాల తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం ఆదేశాలతో ఆత్మకూరు డిఎస్పి కే.వేణుగోపాల్ గారి సూచనలతో ఆత్మకూరు సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో నేటి ఉదయం నుండి పలు ప్రాంతాలలో వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణ శివారులో మరియు గ్రామీణ ప్రాంతాలలో అనుమానం ఉన్న ప్రాంతాలన్నీ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా నేడు ఏఎస్ పేట మండల కేంద్రంలోని లాడ్జిలు, విశ్రాంతి గృహాలు, గెస్ట్ హౌస్ లను ఆత్మకూరు సిఐ గంగాధర్, ఆత్మకూరు ఎస్సై జిలాని మర్రిపాడు ఎస్సై శ్రీనివాసులు వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలలోని రూములన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు.లాడ్జిలలో ఉండే వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఎవరైనా అనుమానస్పదమైన వ్యక్తులు గాని వారి కదలికలు గాని కనిపెడుతూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు సూచించారు.. నెల్లూరు జిల్లాలో నేరచరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలను గమనిస్తూ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెడుతూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం ఇచ్చిన ఆదేశాలతో జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగాధర్ తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :