Sunday, 26 July 2026 03:51:57 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి : జేసీ శివ్ నారాయణ శర్మ

Date : 25 May 2026 07:28 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి : జేసీ శివ్ నారాయణ శర్మ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీలను ప్రత్యేక దృష్టితో వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రజల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి గ్రీవెన్స్‌పై నిరంతరం మానిటరింగ్ నిర్వహించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు అందాయి. మదనపల్లి మండలం బసినికొండ గంగమ్మ గుడి వీధికి చెందిన జి. కస్తూరి తన భర్త మరణించి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కుటుంబానికి ఎలాంటి ఆదారం లేదని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే మదనపల్లి మండలం రామాచార్లపల్లికి చెందిన శారద తన భర్త ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ బైక్ ప్రమాదంలో మరణించారని, ప్రస్తుతం రూ.2901 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారిందని, ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొత్తం 393 అర్జీలు అందగా, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :