నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : సచివాలయాల పరిధిలోని మారుమూల గ్రామాలలో పారిశుద్ధంపై దృష్టి సారించాలని ఎంపీడీవో ఉషారాణి కార్యదర్శి తోపాటు బ్రెయిన్ అంబాసిడర్లకు సూచించారు. బుధవారం ఆమె మండలంలోని మర్రిమాకులపల్లి, కన్నెమడుగు పంచాయతీల్లో డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ లతో కలిసి పలు గ్రామాలను పర్యటించారు. గ్రామాలలో పారిశుధ్యం పై గ్రీన్ అంబాసిడర్ల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై చొరవ చూపాలని కార్యదర్శులకు సూచించారు. అక్కడే స్వచ్చ రథం నిర్వహణపై ఆరా తీసి పనికిరాని ప్లాస్టిక్ ఇతర వస్తువులు సేకరణ అందుకు తగ్గట్టు సరుకులు పొందడం పై హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News