నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని నిమ్మనపల్లె రోడ్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పి4 (P4) కమ్యూనిటీ అడాప్షన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. ఆర్. వసంత్ సెల్వకుమార్ గారు విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. ఇందులో పెన్నులు, పెన్సిల్స్, నోట్‌బుక్స్, షార్పనర్లు వంటి విద్యా అవసరాల వస్తువులు అందజేశారు. విద్యార్థుల చదువులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు, వారికి నిరంతరం స్టేషనరీ సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను డా. వసంత్ సెల్వకుమార్ గారు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ కేదార్ గౌరవ్, సిబ్బంది జె. నందిని, శ్రీవాణి, యస్వంత్, లోహిత పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు సహకారం అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. సాలమ్మ, మరియు విద్యార్థులు వారి తల్లితండ్రులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ డా. వసంత్ సెల్వకుమార్ గారికి మరియు పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News