Sunday, 26 July 2026 03:52:07 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

శ్రీ రాజశ్రీ ట్రాక్టర్స్ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

ముఖ్య అతిధిగా రాజంపేట పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్

Date : 07 November 2025 10:40 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 07 : మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు రామ తులసి కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం శ్రీ రాజశ్రీ ట్రాక్టర్స్( న్యూ హాలాండ్ ) షోరూమ్ ను ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా ప్రారంభించారు. రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల పెద్దిరెడ్డి యాజమాన్యం తో ఈ షోరూంను ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా అధునాతనమైన టెక్నాలజీతో ఏర్పాటుచేసిన న్యూ హాలాండ్ ట్రాక్టర్ ను నడిపి, ఈ ట్రాక్టర్ యొక్క ఉపయోగాలను తెలియజేశారు. రైతుల వ్యవసాయానికి సంబంధించి న్యూ హాలండ్ ట్రాక్టర్ అనేక రకాలుగా ఉపయోగపడి, వారికి అవసరమయ్యే అన్ని అవసరాలను వేగవంతంగా చేస్తూ, కొత్త టెక్నాలజీతో తయారైన ఈ ట్రాక్టర్ ను రైతులు కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పార్టీ నేత పెద్దిరెడ్డి ఈ షోరూం ను రైతుల కోసమే ప్రారంభించినట్లు తెలిపారు. మదనపల్లితో పాటు వి.కోట, రాజంపేట పట్టణంలో కూడా ఈ షోరూం ను ప్రారంభించడం సంతోషమన్నారు. డబుల్ క్లిక్ సదుపాయాలు, అధిక పిటిఓ, హెచ్.పి, తక్కువ గేర్ ఆయిల్ సామర్థ్యం, ఎక్కువ పనితీరు, 125 సంవత్సరాల అనుభవం, అత్యధిక మన్నిక కలిగిన హాలాండ్ ట్రాక్టర్ ను రైతులు కొనుగోలు చేసి లాభాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ట్రాక్టర్ షోరూమ్ యజమాని పెద్దిరెడ్డి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో న్యూ హాలాండ్ ట్రాక్టర్ షోరూం ప్రారంభించడం సంతోషమన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత నాణ్యతతో నెంబర్ వన్ ట్రాక్టర్ కంపెనీ న్యూ హాలాండ్ అన్నారు. రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో తయారైన న్యూ హాలాండ్ ట్రాక్టర్ వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :