నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భద్రాచలం - మార్చి 21 : భద్రాచలం పరిధిలోని కొల్లిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైనది తెలిసిందే. నదిలోకి ఏడుగురు దిగ గా వారిలో ఐదుగురు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయట పడిన ఘటన లో అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్ ప్రవాహంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో మృతదేహాలను పోలీసులు వెలికి తీస్తున్న క్రమంలో మదనపల్లె కు చెందిన విద్యార్థి సతీష్ మృతదేహాన్ని శనివారం వెలికి తీశారు.
Admin
Namitha News