Sunday, 26 July 2026 01:12:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సమాజాన్ని జాగృతం చేసిన ప్రపంచకవి యోగివేమన

కొనియాడిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు

Date : 19 January 2026 07:32 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సమాజాన్ని జాగృతం చేసిన ప్రపంచకవి యోగివేమన - కొనియాడిన రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు - రెడ్డి సంక్షేమ భవనం నందు ఘనంగా జయంతి వేడుకలు మదనపల్లె : తన అద్వితీయమైన పద్యాలతో సమాజాన్ని జాగృతం చేసిన మహాకవి యోగివేమన అని మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు.సోమవారం యోగివేమన జయంతిని పురస్కరించుకొని బెంగళూరు రోడ్డులోని రెడ్డి సంక్షేమ సంఘం భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ కొండవీడు ప్రాంతంలో రెడ్డి రాజుల వంశంలో జన్మించిన మహాపురుషుడని కొనియాడారు.అనంతరం అనంతపురం జిల్లా కటారుపల్లిలో తన జీవితాన్ని గడిపి అద్భుతమైన పద్యాలను రచించారు.వాటిని సిపి బ్రౌన్ గ్రంథాల రూపంలో ముద్రించి వేమన పద్యాలకు ఊపిరి పోశారన్నారు.ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు రచించిన భగవద్గీత తర్వాత వేమన పద్యాలు అంత ప్రాచుర్యం పొందాయన్నారు.యోగి వేమన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని,వేమన పద్యాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు.ఆ మహనీయుడు ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా రెడ్డి సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కలసికట్టుగా ముందుకు సాగుతామన్నారు.నిరుపేద రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించాలని తీర్మానించారు.పట్టణంలో యోగివేమన విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం ఎంచుకొంటే మునిసిపల్ కౌన్సిల్ నందు పెట్టి ఆమోదింపజేస్తామని చైర్ పర్సన్ మనూజా రెడ్డి హామీఇచ్చారు.ఇకపోతే ఈ ఏడాది మార్చిలో రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.అధ్యక్షులు గుడిబండ రవికుమార్ రెడ్డి,సెక్రటరీ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు రామచంద్రారెడ్డి,ఉపాధ్యక్షులు వి.సాంబశివారెడ్డి,కోశాధికారి వై.గిరిధర్ రెడ్డి,జాయింట్ సెక్రెటరీ కే.సుధాకర్ రెడ్డి,కో-ఆర్డినేటర్ ఎన్.సాంబశివరెడ్డి,సభ్యులు శేషాద్రి రెడ్డి,రామలింగారెడ్డి,జై చంద్రారెడ్డి వేణుగోపాల్ రెడ్డి,రంగారెడ్డి మాధవరెడ్డి,కరుణాకర్ రెడ్డి,సుబ్రమణ్యం రెడ్డి,కృష్ణారెడ్డి,ఎస్.భాస్కర్ రెడ్డి,గంగాధర్ రెడ్డి,కోదండరామిరెడ్డి,ఆర్.ఐ రమణారెడ్డి,సి.భాస్కర్ రెడ్డి,ఆర్టీసీ రామలింగారెడ్డి,జనార్దన్ రెడ్డి,మస్తాన్ రెడ్డి,సుబ్బారెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,మరియు మున్సిపల్ ఛైర్పర్సన్ వరపన మనూజా రెడ్డి,వి.ఎస్ రెడ్డి,ఆర్.సీ.డిఎస్ సురేంద్ర రెడ్డి,పద్మాప్రియ రెడ్డి,సుగుణా రెడ్డి,చంద్రా రెడ్డి,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,శరత్ రెడ్డి,ద్వారకానాథ్ రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,ఆవుల సోమశేఖర్ రెడ్డి,కేశవ రెడ్డి,వేమారెడ్డి,రామక్రిష్ణా రెడ్డి సీడ్స్,బి.మల్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :