Monday, 27 July 2026 12:07:47 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

ఆత్మకూరు డివిజనల్ లోని విద్యుత్ శాఖ ఉద్యోగుల ఔదర్యం

Date : 21 January 2026 02:26 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 21 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద విద్యుత్ శాఖ ఉద్యోగస్తులతో స్వచ్ఛందగా మెగా రక్తదాన శిబిరం ను భారీ ఎత్తున నిర్వహించారు. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ M.భాను నాయక్ ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా డివిజన్ పరిధిలోని అన్ని విద్యుత్ కార్యాలయాల150 మంది సిబ్బంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం భాను నాయక్ మాట్లాడుతూ తమ నెల్లూరు జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ కె.రాఘవేంద్రం గారి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించమని రక్తదానం ప్రాణదానం తో సమానం అని ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వవచ్చని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉచిత స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఇదే మొదటిసారి అని గతంలో తాను కొన్నిచోట్ల రక్తదానం చేసి ఉన్నానని అదే స్ఫూర్తితో తమ కార్యాలయ పరిధిలో ఉద్యోగస్తుల సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది తరచు ప్రమాదాలకుగురైన సమయంలో వారికి రక్తం అవసరం అవుతుందని అదే అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్జ్యూమర్ రేట్స్ ఫోరం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు తిరుపాలు హాజరయ్యారు.. ఈ ఉచిత రక్తదాన శిబిరంలో ఉదయగిరి, కలిగిరి సబ్ డివిజన్ ఏడీఈ లు కే.సుధీర్, కృష్ణమోహన్ లు పాల్గొని రక్తదానం చేశారు. వీరితోపాటు ఈ రక్తదాన శిబిరంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దినేష్, ఏ.హరికృష్ణ, జమీల బేగం, గంగా సుబ్బయ్య, ఎం సురేష్, శ్రీనివాసులు, లిఖిత్ ష్ రెడ్డి, శ్రీహరి, వెంకటసుబ్బయ్య, జంగయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ అండ్ కమర్షియల్ సిహెచ్ ప్రసన్నకుమారి తో పాటు 150 మంది విద్యుత్ ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా తమ రక్తాన్ని అందించారు.. వీరందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ నిర్వహకులు సాధిక్ హుస్సేన్, శ్రీనివాసులు ద్వారా సర్టిఫికెట్స్ అందించారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :