నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 08 : రామసముద్రం మండలంలో అత్యంత వైభవంగా బుధవారం భక్తిశ్రద్ధలతో తబ్లిఘి ఇజ్తిమా ప్రారంభం కాగా, ముస్లిం సోదరులు ఎంత పవిత్రంగా ఆధ్యాత్మిక గొప్ప కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి మత పెద్దలు విచ్చేసి తబ్లిఘి ఇజ్తిమాలో మత ప్రవక్తల బోధనలు తెలుసుకోవడంతో పాటు, మత సామ్రాస్యాన్ని ఎంతో పెంపొందిస్తుందని ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తి మార్గం తప్ప వేరే ఇతర అంశాలు చర్చకు రాదని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమం రామసముద్రంలో జరగడం మొదటిసారి కావడం విశేషం ఈ వేడుకకు విద్యుత్ అలంకరణతో దిగువపేట మొత్తం కళకళలాడుతుంది, అల్లా ప్రార్ధనలతో ఒక భక్తి భావంతో పులకించిపోయింది, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,మదనపల్లి, పలమనేరు,పుంగనూరు, చౌడేపల్లి,కర్ణాటక, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల చుట్టుపక్క జిల్లాలు వారికి మన రామసముద్రం ముస్లిం సోదరులు వారికి ఘన స్వాగతం ఆహ్వానిస్తున్నారు, ఈ కార్యక్రమానికి విచ్చేసి ముస్లిం సోదరులకు కావలసిన సకల సౌకర్యాలని ఏర్పాటు చేశారు, టిఫిన్,భోజనం,వాటర్,స్నాక్స్, టీ,కాఫీ,వాష్రూమ్స్, టాయిలెట్స్, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు ఇలా అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేశారు, రామసముద్రం ఇజ్తిమా లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాష, నియోజకవర్గం ప్రజలు మేలు జరగాలని ప్రార్ధనలు చేశారు. ఇస్తమాలో ఆకర్షణగా నిలిచిన దుకాణాలు బెంగళూరు మైసూర్ ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు ఇజ్తిమాలో పాల్గొని వారికోసం షాపింగ్ చేసుకునేందుకు దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.తినుబండారాలు, దుస్తులు,పిల్లలకి కావలసిన ఆట బొమ్మలు,ఇలా రకరకాల వస్తువులు ఆకర్షణగా నిలిచి సందడిగా మారింది.ఇంత పెద్ద షాపింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం రామ సముద్రంలో మొదటిసారి కావడం విశేషం ఇజ్తిమాలో ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల కేంద్రంలో ప్రధాన కూటమిలో యస్.ఐ. ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Admin
Namitha News