Sunday, 26 July 2026 01:38:27 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

హోంగార్డ్ కుటుంబాలకు అండగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మరణించిన ముగ్గురు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆసరాగా సహచర హోంగార్డ్ లు, విరాళంగా ఒకరోజు వేతనం

Date : 28 March 2026 11:03 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన ముగ్గురు సహచరుల కుటుంబాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం కొండంత అండగా నిలిచింది. హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేకరించిన తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లాలోని హోంగార్డుల ఒకరోజు డ్యూటీ అలవెన్సు నుండి సేకరించిన విరాళాల వివరాలను ఆర్. వెంకటరమణ (HG 445) భార్య శ్రీమతి డి. తులసమ్మ కు రూ 2,28,620/- లను, ఎస్.వి. చలపతి (HG 335) భార్య శ్రీమతి జి. సరళ రూ 2,25,780 లను, ఎం. వేణుగోపాల్ (HG 303) శ్రీమతి కె. చంద్రకళ 2,24,360 లను చెక్కు రూపంలో అందచేశారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ.. "విధుల నిర్వహణలో మన సహచరులను కోల్పోవడం పోలీస్ కుటుంబానికి తీరని లోటు, ఒకరి కష్టం చూసి మరొకరు స్పందించడమే నిజమైన మానవత్వం. తోటి సిబ్బంది కుటుంబాలు వీధిన పడకూడదనే ఉద్దేశంతో హోంగార్డులందరూ కలిసి తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయం. పోలీసు విభాగం కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే కాదు, కష్టాల్లో ఉన్న సొంత సిబ్బందిని కాపాడుకోవడంలోనూ ముందుంటుందని ఈ సంఘటన నిరూపించింది. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు శాఖా పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ శ్రీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ బాలాజీ, హెడ్ కానిస్టేబుళ్ళు రమేష్, లక్ష్మిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: