Monday, 27 July 2026 12:48:53 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వెలుగు పాఠశాలలో భారీ ఉచిత వైద్య శిబిరం

వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలకు విశేష స్పందన

Date : 09 May 2026 08:00 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు పాఠశాలలో భారీ ఉచిత వైద్య శిబిరం వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలకు విశేష స్పందన స్థానిక వెలుగు పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డిశేఖర్, గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అధ్యక్షుడు కోన భాస్కర్, యంగ్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు లక్ష్మి, రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో బెంగళూరులోని వైదేహి హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ రిత్విక్ సర్జన్, డాక్టర్ సాయినాథ్ జనరల్ మెడిసిన్, డాక్టర్ టిన్ను ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్ గగన్ ఆర్థోపెడిక్ నిపుణులు పాల్గొని గుండె, క్యాన్సర్, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, కిడ్నీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈఎన్టీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు, వృద్ధులు, అమ్మచెరువు మిట్ట ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ల్యాబ్ టెక్నీషియన్ సబిన్ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద అర్హులైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. తరువాత విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిత్విక్, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ టిన్ను, డాక్టర్ గగన్, యంగ్ ఇండియా సభ్యులు రాజశేఖర్, లక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డిశేఖర్, కోన భాస్కర్, వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎం. ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపాల్ లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, సోషల్ వర్కర్ గీత, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :