Monday, 27 July 2026 04:18:04 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ లో ఎక్సపర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశం పై అతిధి ఉపన్యాసం

అఖిల భారత సాంకేతిక విద్యామండలి, న్యూడిల్లీ వారి సహకారం

Date : 24 February 2026 10:15 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 24 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (అర్టిఫిషల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో విద్యార్థుల కోసం “ఎక్సపర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇంజనీరింగ్” అనే అంశంపై ప్రత్యేక అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన డి.అర్.డీ ఓ మాజీ శాస్త్రవేత్త మరియు డిఫెన్స్ రంగంలో మెటలర్జీ మరియు ఆధునిక లోహ సాంకేతికతల అభివృద్ధిలో కృషి చేసిన డాక్టర్ ఏ. వేణుగోపాల్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎక్సపర్ట్ సిస్టమ్స్ అనేవి మనుషుల అనుభవం మరియు జ్ఞానాన్ని కంప్యూటర్‌లో నిల్వ చేసి సమస్యలను పరిష్కరించే విధానం అని అన్నారు. ఇంజనీరింగ్‌లో వచ్చే క్లిష్టమైన సమస్యలను నియమాలు మరియు ప్రత్యేక రంగానికి సంబంధించిన జ్ఞానం ద్వారా ఎలా పరిష్కరించవచ్చో ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు. డిఫెన్స్ రంగంలో చేసిన పరిశోధనల ఆధారంగా, ముఖ్యమైన యంత్రాలు సరిగా పనిచేయడంలో, లోపాలను ముందుగా గుర్తించడంలో మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సిస్టమ్స్ ఉపయోగాన్ని తెలిపారు . బ్లాక్‌బాక్స్ ఏ.ఐ మోడళ్లతో పోలిస్తే ఎక్సపర్ట్ సిస్టమ్స్ నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో తెలివైన నిర్ణయ వ్యవస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని, దేశ సాంకేతిక అభివృద్ధిలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ మరియు కృత్రిమ మేధస్సు (AI)లో నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు అయిన డి.అర్.డీ ఓ, ఇస్రో వంటి సంస్థలలో డేటా సైంటిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, రోబోటిక్స్ ఇంజినీర్, ఆటోమేషన్ ఇంజినీర్ వంటి అవకాశాలతోపాటు, క్వాలిటీ కంట్రోల్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి వంటి రంగాల్లో నైపుణ్యం సాధించడం ద్వారా విద్యార్థులు ఉన్నత వేతనాలు, అంతర్జాతీయ అవకాశాలు మరియు పరిశోధన రంగాల్లో మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోగలరు అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ కోఆర్డినేటర్ తారకేశ్వర్ రాజు, కో-కోఆర్డినేటర్లు జి. నితిన్, సుభాష్ దాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: