నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహానేత స్వర్గీయ వైఎస్సార్ 77 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువ జన విభాగం అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ... దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో బుధవారం పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం సేవలందించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు, ప్రజల పట్ల ఆయన చూపిన మానవత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు, ప్రజలకు పండ్లు, బ్రెడ్‌తో పాటు ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భయ్యా రెడ్డి, రెడ్డి భాస్కర్, పూర్ణ, రతీష్, అశోక్ రాయల్, కౌశిక్ రాజు, గోవా బ్రదర్స్, గిరీష్, దీపు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Reporter
Namitha News